Pages

Sunday 9 June 2013

DUET - Anjali Anjali Pushpaanjali ( అంజలి అంజలి పుష్పాంజలి )

లలలల...............
అంజలి అంజలి పుష్పాంజలి(2)
పూవంటి పదములకు పుష్పాంజలి
ముద్దైన పెదవులకు మోహాంజలి
కలహంస నడకలకు గీతాంజలి
కనరాని నగవులకు కవితాంజలి

నిన్నదాక నువ్వు నేను
ఇరువురం ఎవరనీ
కమ్మని బంధం ఇలా తెలిపెను ఒకటని
కడలిని పడు వానలా కలిసిన మది ఇది
కరిగిన సిరి మోజులా కధ ఇది నా చెలి
ఎదురుగ తొలి స్వప్నం తొణికినది
ఎదలో మధు కావ్యం పలికినది
అంజలి అంజలి 
వలపుల నా చెలి (పూవంటి)

కన్నుల సంకేతమే కలలకు తొలకరి
వెన్నెల జలపాతమే వలపుకు తదుపరి
గుండెలో సంగీతమే కురిసినదెందుకో
కోయిల పాటే ఇలా పలికిన విందుకో
చిలువుగ ఎద మారే మధు వనిగా
అమవాస నిశి మారె వెన్నెలగా
అంజలి అంజలి ఇది హృదయాంజలి
నీ ప్రేమ లాహిరికి పుష్పాంజలి
నీ గాన మాధురికి గీతాంజలి
ఎద దోచు నవ్వులకు నటనాంజలి
కవి అయిన నీ మదికి కవితాంజలి(అంజలి)

అంజలి నీ చూపులో వెన్నెల వెల్లువే
అంజలి నా ఊపిరి పలికెను పల్లవే
కన్నుల నువ్వు లేనిదే కలలే రావులే
నా మది నువ్వు లేనిదే కవితే లేదులే
తెలిసెను నువ్వే నా మనసువని
మోజుకు నెలవైన వలపువని
అంజలి అంజలి వలపు లతాంజలి

No comments:

Post a Comment

Thanks for Your Response!!!! Have A Nice Day!!!