Pages

Tuesday 24 September 2013

Attarintiki Daredi - Veedu AARADUGULA BULLETTO



గగనపు వీధి వీడి వలస వెళ్లిపోయిన నీలి మబ్బు కోసం
తరలింది తనకు తానె ఆకాశం పరదేశం
శిఖరపు అంచు నుంచి నేల జారి పోయిన నీటి చుక్క కోసం
విడిచింది చూడు నగమె తన వాసం వనవాసం

భైరవుడొ భార్గవుడొ భాస్కరుడొ మరి రక్కసుడొ
ఉక్కు తీగలాంటి ఒంటి నైజం
వీడు మెరుపులన్ని ఒక్కటైన తేజం
రక్షకుడొ తక్షకుడొ పరీక్షలకె సుశిక్షితుడో
శత్రువు అంటు లేని వింత యుద్ధం
వీడి గుండె లోతు గాయమైన శబ్ధం
నడిచొచ్చె నర్తన శౌరీ
పరిగెత్తె పరక్రమ శైలీ
హలాహలం హరించిన ధగ్ ధగ్ హృదయుడొ

వీడు ఆరడుగుల బుల్లెట్టు
వీడు ధైర్యం విసిరిన రాకెట్టూ

గగనపు వీధి వీడి వలస వెళ్లిపోయిన నీలి మబ్బు కోసం
తరలింది తనకు తానె ఆకాశం పరదేశం
శిఖరపు అంచు నుంచి నేల జారి పోయిన నీటి చుక్క కోసం
విడిచింది చూడు నగమె తన వాసం వనవాసం

దివి నుంచి భువి పైకి భగ భగ మని కురిసేటి
విన్పించని కిరణం చప్పుడు వీడు
వడివడిగ వడగళ్లై ధడ ధడమని జారేటి
కనిపించని జడి వానేగ వీడూ
శంఖంలొ దాగేటి పోటెత్తిన సంద్రం హోరితడు
శోకాన్నె దాచేసె అశోకుడు వీడురొ

వీడు ఆరడుగుల బుల్లెట్టువీడు ధైర్యం విసిరిన రాకెట్టూ

తన మొదలె వదులుకొని పైకెదిగిన కొమ్మలకి
చిగురించిన చోటుని చూపిస్తాడు
తన దిశనె మార్చుకొని ప్రభవించె సూర్యుడికి
తన తూరుపు పరిచయమె చేస్తాడూ
రావణుడొ రాఘవుడొ మనసును దోచె మాధవుడొ
సైనికుడొ శ్రామికుడొ అసాధ్యుడు వీడురో

వీడు ఆరడుగుల బుల్లెట్టు వీడు ధైర్యం విసిరిన రాకెట్టూ

గగనపు వీధి వీడి వలస వెళ్లిపోయిన నీలి మబ్బు కోసం
తరలింది తనకు తానె ఆకాశం పరదేశం
శిఖరపు అంచు నుంచి నేల జారి పోయిన నీటి చుక్క కోసం

గానం : MLR కార్తికేయన్, విజయ్ ప్రకాష్ 
సాహిత్యం : శ్రీ మణి 
సంగీతం : దేవి శ్రీ ప్రసాద్ 

Attarintiki Daredi - Ninnu Chudagane Chitti Gunde

నిన్ను చూడగానే చిట్టి గుండె గట్టిగానే కొట్టుకున్నదే... అదేమిటే
నిన్ను చూడకుంటే రెండు కళ్లు ఒకటినొకటి తిట్టుకున్నవే... అదేమిటే
ఏమిటో ఏం మాయో చేసినావె కంటిచూపుతోటి
ఏమిటో ఇదేమి రోగమో అంటించినావే ఒంటి ఊపుతోటి
ముంచే వరదలా కాల్చే ప్రమిదలా చంపావే మరదలా

అంత పెద్ద ఆకాశం అంతులేని  నీలం
నీ చేప కళ్ల లోతుల్లో ఎట్ట నింపావే ఇరగదీశావే
భూమిలోన బంగారం దాగి ఉందనేది  సత్యం
దాన్ని నువ్వు భూమిపైన పెరిగేస్తూ
ఇట్టా తిరిగేస్తూ తిరగ రాశావే
హే... అలా నువ్వు చీరకట్టి చిందులేస్తే
చీమలా నేను వెంటపడనా
నావలా నువ్వు తూగుతూ నడుస్తు వుంటే
కాపలాకి నేను వెంటరానా
కృష్ణ రాధలా నొప్పి బాధలా ఉందాం రా మరదలా

అత్తలేని కోడలుత్తమురాలు ఓలమ్మా
కోడల్లేని అత్త గుణవంతురాలు కోడలా కోడలా
కొడుకు పెళ్లామా ఓలమ్మా
పచ్చిపాల మీద మీగడేదమ్మా
 వేడిపాలలోన వెన్న ఏదమ్మా

మోనాలిసా చిత్రాన్ని గీసినోడు ఎవడైనా
 పాలసీసా అందాన్ని చూడనే లేదు ఇంక ఏం లాభం
కోహినూరు వజ్రాన్ని ఎత్తుకెళ్లినోడు రాజైనా
దాని మెరుపు నీలోనే దాగివుందని తెలియలే పాపం
ఇంతిలా నువ్వు పుట్టుకొస్తే
నేను మాత్రం ఎంతని పొగిడి పాడగలను
తెలుగుభాషలో నాకు తెలిసిన పదాలు అన్నీ
గుమ్మరించి ఇంత రాసినాను
సిరివెన్నెల మూటలా... వేటూరి పాటలా...

ముద్దుగున్నావే మరదలా

Attarintiki Daredi - Kiraakku Kiraakku

ఓసోసి పిల్లపోరి ఓ చిన్న మాట జారి ఏం దెబ్బ తీసినావే
రాకాసి రాకుమారి కోపంగా పళ్లునూరి ఐ లవ్మూ చెప్పినావే
అందంగ పెట్టినావే స్పాటు
గుండె తాకిందే ప్రేమ గన్ను షాటు
ఏది లెఫ్టు ఏది నాకు రైటు మందు కొట్టకుంటనే నేను టైటు
క్యాట్ బాలు లాగిపెట్టి మల్లెపూలు చల్లినట్టు
షర్టు జేబు కింద చిట్టి బాంబ్ బ్లాస్టు జరిగినట్టు
పిచ్చి పిచ్చిగుందే
కిర్రాకు కిర్రాకు కిర్రాకు ర్రాకు ర్రాకు పుట్టించావే
కిర్రాకు కిర్రాకు కిర్రాకు
ర్రాకు కేక పెట్టించావే

పెదవి స్ట్రాబెరీ పలుకు క్యాడ్‌బరీ
సొగసు తీగలో కదిలింది పూల నర్సరీ
కళ్లలో కలల గ్యాలరీ చిలిపిచూపులో
కొలువుంది ద్రాక్ష మాధురి
అత్తరేదో చల్లినావే అత్తగారి పిల్లా
సిత్తరాల నవ్వుపైన రతనాలు జల్లా
కొత్తప్రేమ మత్తు నన్ను హత్తుకుంటే ఇల్లా
పిచ్చి పిచ్చిగుందే॥

మాంకాళి జాతర్లో మైకుసెట్టు మోగినట్టు
మైండంత గోలగుందే
బెంగాలీ స్వీటులోన భంగేదో కలిపి తిన్న
ఫీలింగు కమ్ముతోందే
కౌబాయి డ్రెస్సు వేసిన ట్టూ క్రష్ణరాయలోరి గుర్రమెక్కినట్టు
భూమ్మీద ఉన్నచోటే ఉంటూ
ఆ మూను మీద కాలు పెట్టినట్టు
సిమ్ము లేని సెల్లులోకి ఇన్‌కమింగు వచ్చినట్టు
సింగరేణి బొగ్గు తీసి ఫేసు పౌడరద్దినట్టు పిచ్చిపిచ్చిగుందే॥
గానం : పాలక్కడ్ శ్రీరామ్, రీటా
రచన :  రామజోగయ్య శాస్త్రి
సంగీతం : దేవిశ్రీ ప్రసాద్