Pages

Tuesday 17 September 2013

Pedave Palikina - Nani AMMA song పెదవే పలికిన మాటల్లోనే

పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మ 
కదిలే దేవత అమ్మ కంటికి వెలుగమ్మా
తనలో మమతే కలిపి పెడుతుంది ముద్దగా 
తన లాలిపాటలోని  సరిగమ పంచుతుంది ప్రేమ మదురిమ 


మనలోని ప్రాణం అమ్మ 
మనదైన రూపం అమ్మ 
ఎనలేని జాలి గుణమే అమ్మ 
నడిపించే దీపం అమ్మ
కరుణించే కోపం అమ్మ 
వరమిచ్చే తీపి శాపం అమ్మ 
నా ఆలి అమ్మగా అవుతుందని జోలాలి పాడనా కమ్మగా కమ్మగా 


పొత్తిల్లో ఎదిగేబాబు 
నా ఒల్లో  ఒదిగే బాబు 
ఇరువురికి నేను అమ్మవనా 
నాకొంగు పట్టేవాడు 
నాకడుపున పుట్టేవాడు 
ఇద్దరికీ ప్రేమ అందించనా
నా చిన్ని నాన్న నీ వాడి నాన్న నీ నూరేళ్ళు సాకనా చల్లగా చల్లగా 


ఎదిగి ఎదగని ఓ పసికునా ముద్దుల కన్నా జో జో 
బంగారు తండ్రి జో జో బజ్జో లాలిజో 
పలికే పదమే వినక కనులారా నిదురపో 
కలలోకి నేను చేరి తదుపరి పంచుతాను ప్రేమ మాధురి  "ఎదిగీ"

No comments:

Post a Comment

Thanks for Your Response!!!! Have A Nice Day!!!