Pages

Tuesday, 24 September 2013

Attarintiki Daredi - DEVA DEVAM BHAJE DIVYA PRABHAVAM




దేవదేవం భజే దివ్య ప్రభావం
రావణాసుర వైరి
రణపుంగవం రామం

వేల సుమ గంధముల గాలి అలలా
కలల చిరునవ్వులతో కదిలినాడు
రాల హృదయాల తడిమేటి తడిలా
కరుణగల వరుణుడై కరిగినాడు

అతనొక ఆకాశం అంతెరుగని శూన్యం
ఆవిరి మేఘాలే ఆతని సొంతం
అరమరికల వైరం కాల్చెడి అంగారం
వెలుగుల వైభోగం ఆతని నయనం

ప్రాణ ఋణబంధముల తరువును
పుడమిగ నిలుపుటె తన గుణం
గానం : నరేంద్ర
రచన :  రామజోగయ్య శాస్త్రి
సంగీతం : దేవిశ్రీ ప్రసాద్

No comments:

Post a Comment

Thanks for Your Response!!!! Have A Nice Day!!!