Pages

Tuesday 24 September 2013

Attarintiki Daredi - Veedu AARADUGULA BULLETTO



గగనపు వీధి వీడి వలస వెళ్లిపోయిన నీలి మబ్బు కోసం
తరలింది తనకు తానె ఆకాశం పరదేశం
శిఖరపు అంచు నుంచి నేల జారి పోయిన నీటి చుక్క కోసం
విడిచింది చూడు నగమె తన వాసం వనవాసం

భైరవుడొ భార్గవుడొ భాస్కరుడొ మరి రక్కసుడొ
ఉక్కు తీగలాంటి ఒంటి నైజం
వీడు మెరుపులన్ని ఒక్కటైన తేజం
రక్షకుడొ తక్షకుడొ పరీక్షలకె సుశిక్షితుడో
శత్రువు అంటు లేని వింత యుద్ధం
వీడి గుండె లోతు గాయమైన శబ్ధం
నడిచొచ్చె నర్తన శౌరీ
పరిగెత్తె పరక్రమ శైలీ
హలాహలం హరించిన ధగ్ ధగ్ హృదయుడొ

వీడు ఆరడుగుల బుల్లెట్టు
వీడు ధైర్యం విసిరిన రాకెట్టూ

గగనపు వీధి వీడి వలస వెళ్లిపోయిన నీలి మబ్బు కోసం
తరలింది తనకు తానె ఆకాశం పరదేశం
శిఖరపు అంచు నుంచి నేల జారి పోయిన నీటి చుక్క కోసం
విడిచింది చూడు నగమె తన వాసం వనవాసం

దివి నుంచి భువి పైకి భగ భగ మని కురిసేటి
విన్పించని కిరణం చప్పుడు వీడు
వడివడిగ వడగళ్లై ధడ ధడమని జారేటి
కనిపించని జడి వానేగ వీడూ
శంఖంలొ దాగేటి పోటెత్తిన సంద్రం హోరితడు
శోకాన్నె దాచేసె అశోకుడు వీడురొ

వీడు ఆరడుగుల బుల్లెట్టువీడు ధైర్యం విసిరిన రాకెట్టూ

తన మొదలె వదులుకొని పైకెదిగిన కొమ్మలకి
చిగురించిన చోటుని చూపిస్తాడు
తన దిశనె మార్చుకొని ప్రభవించె సూర్యుడికి
తన తూరుపు పరిచయమె చేస్తాడూ
రావణుడొ రాఘవుడొ మనసును దోచె మాధవుడొ
సైనికుడొ శ్రామికుడొ అసాధ్యుడు వీడురో

వీడు ఆరడుగుల బుల్లెట్టు వీడు ధైర్యం విసిరిన రాకెట్టూ

గగనపు వీధి వీడి వలస వెళ్లిపోయిన నీలి మబ్బు కోసం
తరలింది తనకు తానె ఆకాశం పరదేశం
శిఖరపు అంచు నుంచి నేల జారి పోయిన నీటి చుక్క కోసం

గానం : MLR కార్తికేయన్, విజయ్ ప్రకాష్ 
సాహిత్యం : శ్రీ మణి 
సంగీతం : దేవి శ్రీ ప్రసాద్ 

No comments:

Post a Comment

Thanks for Your Response!!!! Have A Nice Day!!!